సిఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం తలపెట్టిన సమావేశానికి అనుమతి ఇవ్వద్దు : డాక్టర్ భగవంత్ రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 22, 2020

సిఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం తలపెట్టిన సమావేశానికి అనుమతి ఇవ్వద్దు : డాక్టర్ భగవంత్ రావు


సిఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఈ నెల 25న చార్మినార్ వద్ద తలపెట్టిన సమావేశానికి అనుమతి ఇవ్వరాదని బిజెపి నాయకులు డాక్టర్ భగవంత్ రావు, విహెచ్ పి రాష్ట్ర అధ్యక్షులు రామరాజులు నగర్ సిపి అంజనీకుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా పార్లమెంట్ లో సిఏఏ ఆమోదం పొందిన అనంతరం దానిపై వ్యతిరేకంగా ర్యాలీలు,ధర్నా లు చేయడం దారుణం. ఏదైనా బిల్లు చట్టరూపం దాల్చిన తరువాత వాటి పై నిరసనలు చేయరాదు. కానీ గతంలో హైదరాబాద్ నగరంలో ప్రధాన రహదారుల పై ర్యాలీలు తీసి రోడ్డలను దిగ్బంధం చేశారు. దీని వలన కొన్ని గంటల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కావున ఈ నెల 25న ఎంఐఎం సిఏఏకు వ్యతిరేకంగా జల్సా పేరుతో సమావేశానికి పూనుకున్నారు. వారం రోజుల క్రితం బైంసాలో ఓ వర్గం మరో వర్గం పై దాడి చేయడం జరిగింది. దీని బట్టి చూస్తే రాష్ట్రంలో హింసను ప్రేరేపంచడానికి కొన్ని శక్తులు చూస్తున్నట్లు అనుమానాలు  తవిస్తున్నాయి. వేల మంది ఒకేసారి రోడ్ల పై రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవడమే కాకుండా హైద్రాబాద్ ప్రతిష్ఠ దెబ్బ తింటుంది. కావున 25న తలపెట్టిన సమావేశాలకు,నిరసనలకు అనుమతి నిరకరించాలని VHP,BJP,BPHS ఆధ్వర్యంలో సీపీకి వినతిపత్రం అందజేసాము. ఈ కార్యక్రమంలో నిరంజన్ యాదవ్,శ్రీకాంత్ రెడ్డి,వినోద్,కామాటి మహేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.