హైదరాబాద్ నగర వాసులకు మరో శుభవార్త. దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రో రైలు వ్యవస్థ కల హైదరాబాద్ మెట్రో సేవలు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకూ సంక్రాంతికి ముందే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మార్గంలో అన్ని పనులూ పూర్తై, ప్రస్తుతం ట్రయల్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రయల్ రన్లో భాగంగా గత నవంబరు నుంచి ఈ మార్గంలో రైళ్లను నడుపుతున్నారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం 11 కిలోమీటర్లు ఉంది. ట్రయల్ రన్లో భాగంగా అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పరిశీలించి, నివేదికలను సంబంధిత సంస్థలకు అధికారులు అందజేశారు.
ట్రయల్ రన్లో భాగంగా భద్రతపరంగా 17 రకాల పరీక్షలను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యేందుకు నెల నుంచి 45 రోజుల సమయం పడుతుందని చెప్పారు. అన్ని సరిగ్గా ఉన్న అనంతరం మెట్రో రైలు నడిచే తీరును కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) బృందం రెండు, మూడు రోజుల పాటు పరీక్షించి తుది పత్రం జారీ చేస్తుంది.కారిడార్-2లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం సైతం ప్రారంభమవుతుండడంతో నగరంలో మొత్తం 67 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలేకాక, పొరుగు రాష్ట్రాలకు కూడా బస్సు సర్వీసులు లభించే ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లను కలుపుతూ మెట్రో అనుసంధానం ఏర్పడితే ప్రయాణికులకు ఎంతో సౌకర్యం కానుంది.
Post Top Ad
Tuesday, January 07, 2020
Home
తెలంగాణ
హైదరాబాద్ మెట్రో సేవలు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకూ సంక్రాంతికి ముందే ప్రారంభమయ్యే సూచనలు
హైదరాబాద్ మెట్రో సేవలు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకూ సంక్రాంతికి ముందే ప్రారంభమయ్యే సూచనలు
Admin Details
Subha Telangana News