తెలంగాణ పురపాలికల ఎన్నికలపై విచారణను వాయిదా వేసిన హై కోర్టు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 06, 2020

తెలంగాణ పురపాలికల ఎన్నికలపై విచారణను వాయిదా వేసిన హై కోర్టు

తెలంగాణ పురపాలికల  ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం వరకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. మునిసిపల్ నోటిఫికేషన్ లో నిబంధనలను పాటించలేదని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.. ఎన్నికల నియమావళిని తనముందు ఉంచాలని ఈసిని ఆదేశించింది. ఆ తర్వాతే రేపు నోటిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేయాలని న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.