విజయవాడ లో బాబు కి ఘోర అవమానం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 09, 2020

విజయవాడ లో బాబు కి ఘోర అవమానం


విజయవాడ లో బాబు కి  అవమానం . శాంతిభద్రతల పేరుతో అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని తెదేపా అధినేతచంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో చంద్రబాబుతో పాటు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాజధాని కోసం పోరాడుతూ ఇప్పటికే 11 మంది రైతులు గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజారాజధాని కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ, తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కనకమేడల రవీంద్ర, మాగంటి బాబు, జనసేన, కాంగ్రెస్‌, సీపీఎం, భాజపా నేతలు సమావేశానికి హాజరయ్యారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )