తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 16, 2020

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌


హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్‌ అభ్యర్థులతో తెలంగాణ భవన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..పట్టణాల్లో విద్యుత్‌, మంచినీటి సమస్య లేకుండా చేశాం. 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు. 75 గజాల ఇంటి స్థలం ఉన్నవారికి 22 రోజుల్లో అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తాం. దేశంలోనే తెలంగాణ మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. మున్సిపాలిటీల్లో 10 శాతం బడ్జెట్‌ గ్రీనరీ కోసం కేటాయించామన్నారు. ఎక్కడికక్కడా మ్యానిఫెస్టోలు రూపొందించుకుని ప్రచారం చేయండని అభ్యర్థులకు కేటీఆర్‌ సూచించారు. ప్రతీ ఇంటికి రెండు నుంచి మూడుసార్లు వెళ్లి కలవండి. రాష్ట్రంలో 3వేల వార్డుల్లో పోటీ జరుగుతుంటే బీజేపీకి 1000 వార్డులు, కాంగ్రెస్‌కు 500 వార్డుల్లో అభ్యర్థులే లేరు. బీఫారాలు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకురాలేదు. గెలుపు మనదే..అతివిశ్వాసంతో ఉండకుండా ప్రచారాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

యోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )