సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాచకొండ సి.పి మహేష్ భాగ్వత్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 11, 2020

సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాచకొండ సి.పి మహేష్ భాగ్వత్


సంక్రాంతి సందర్భంగా ఊరికి వెల్తున్న ప్రజలకు జాగ్రత్తలు చేప్పిన  రాచకొండ సి.పి మహేష్ భాగ్వత్. సెలవలు సందర్భంగా ఊరికి వెల్తున్న ప్రజలు ఖచితంగా  దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని విగ్యప్తి చేసారు. ప్రజలు అందరూ సహకరిస్తేనే దొంగతనాలు నివారించచ్చు అని తెలిపారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేసామని తెలిపారు.
రాత్రివేళలో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా పలు జాగ్రత్తలు తీసుకొని పోలీసులకు సహకరిం
చాలని ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఊరెళ్లేవారికి పోలీసుల సూచనలు...
• ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాల్స్ లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి.
• విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులో
పెట్టడం చేయరాదు.
• ద్విచక్రవాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే
పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలపరాదు.
• బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతో పాటే తీసుకెళ్లాలి.
• ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా
డోర్ కర్టెన్ వేయాలి.
• గ్రామాలకు వెళ్లేవారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు
వేసి ఉంచాలి.