శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 27, 2020

శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు
శాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో మండలి రద్దు చేస్తే పరిస్థితేంటి..? మండలిలోని పార్టీ నేతలకు ఎలా న్యాయం చేయాలి..? ఇలా అన్ని విషయాలపై నిశితంగా చర్చించిన తర్వాత కేబినెట్ నిర్ణయించింది. శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. 99 శాతం మేర మండలిని రద్దు చేసే దిశలోనే సీఎం జగన్‌ ఉన్నారని గత రెండు మూడ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. సీఆర్‌డీఏ రద్దు, రాష్ట్రంలో అధికార, పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలతో అధికారపక్షం విస్తుబోయింది. శాసనసభలో 175 స్థానాలలో 151 స్థానాలతో.. 80 శాతంపైగా సభ్యులను కలిగి బిల్లులను ఆమోదిస్తే, శాసనమండలిలో తిరస్కరణకు గురికావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. ఫలితంగా శాసనమండలిని జగన్‌ రద్దు చేస్తున్నారని టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad