గ్రీన్‌జోన్ పరిధిలోని నెహ్రూ జూలాజికల్ పార్కు, దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, ఇతర జూ పార్కులు, అర్బన్ పార్కులు వంటి వాటిలో షూటింగ్‌కు అనుమతినిస్తారు. జిల్లాల వారీగా ఎల్లో, గ్రీన్ జోన్ల వివరాలను మ్యాప్‌ల రూపంలో పొందుపర్చడం ద్వారా ఎక్కడెక్కడ షూటింగ్ జరుపుకునేందుకు అవకాశం ఉంటుందో తెలియజేయాలనే ఆలోచనతో అటవీశాఖ ఉంది.అటవీశాఖకు సంబంధించి రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్ల కింద రాష్ట్రంలోని అటవీ ప్రాంతాన్ని విభజించారు. రెడ్ జోన్ పరిధిలోని పులులు ఇతర అభయారాణ్యాలు, జాతీయపార్కుల్లో షూటింగ్‌లకు అనుమతినివ్వరు. ఎల్లో జోన్‌లోని రిజర్వ్ ఫారెస్ట్లు, వాటి పరిధిలోని పార్కుల్లో పరిమితంగా ఆయా అంశాల ప్రాతిపదికన అనుమతిస్తారు. సంబంధిత అటవీ అధికారుల పర్యవేక్షణలోనే, నియమ, నిబంధనలకు లోబడి షూటింగ్ చేయాల్సి ఉంటుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )