తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 28, 2020

తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌


 హైదరాబాద్‌ :  తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు మానిటర్ చేస్తుందన్నారు.  బుధవారం కరోనా వైరస్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని. కేంద్ర బృందం కూడా ప్రస్తుతం నగగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యటిస్తుందని పేర్కొన్నారు.నగరంలోని ఫీవర్‌ ఆసుపత్రికి కేంద్ర వైద్యుల బృందం మంగళవారం చేరుకున్నారు. ఆసుపత్రిలోని ఐసోలేటేడ్‌ వార్డులను, కరోనా వైరస్ అనుమానితుల చికిత్స వార్డులను కేంద్ర వైద్యుల బృందం పరిశీలించనున్నారు. 

Post Top Ad