ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాశీంను పోలీసులు అరెస్ట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 19, 2020

ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాశీంను పోలీసులు అరెస్ట్

ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాశీం ఇంట్లో శనివారం ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు చేసే సమయంలో పోలీసులు దూకుడుగా ప్రవర్తించారు. గడ్డపారతో తలుపులు పగులగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోని ప్రతీ వస్తువును తనిఖీ చేయడమే గాక కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను, పుస్తకాలను తీసుకెళ్లారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ పోలీసులు దాడులు చేశారు.ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇటీవలే విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. దీనిని సీపీఐ నేతలు ఖండించారు. ఖాశీం అరెస్ట్‌పై కోర్టు ఆశ్రయిస్తామని ఆయన భార్య స్నేహలత తెలిపారు.


తమ ఇంట్లోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించారని ఖాశీం భార్య స్నేహలత తెలిపారు. ఐదేళ్ల క్రితం జరిగిన కేసుకు సంబంధించి శనివారం సోదాలు చేశారన్నారు. 2016లో అక్రమంగా ఓ కేసు బనాయించారని.. దానిని బూచీగా చూపించి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లెప్పుడు శ్యాం సుందర్ అనే వ్యక్తి వద్ద దొరికిన పుస్తకాల ఆధారంగా కేసు నమోదు చేశారని చెప్పారు.