తెరాస పై నిప్పులు చెరుగుతూ ఆవేశం వెళ్ళకక్కిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 18, 2020

తెరాస పై నిప్పులు చెరుగుతూ ఆవేశం వెళ్ళకక్కిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


సిద్దిపేట జిల్లా: చేర్యాల మున్సిపాలిటీలో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు . ఈ కార్యక్రమం అంతరం తెరాస పై పలు రకాల ఘాటు వాఖ్యలు చేసారు .   చేర్యాల పట్టణ ప్రజలారా కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించండి... అభివృద్ధి మాతోనే జరుగుతుంది..తెలంగాణ వచ్చాక చేర్యాల అనాధగా మారింది.. పోరాటాల చరిత్ర ఉన్న చేర్యాలను టీఆరెస్ అణమకంగా చేసింది.. చేర్యాల రెవిన్యూ డివిజన్ కొరకు చేర్యాల ప్రజలు ఎంతో కొట్లాడరు..  ముఖ్యమంత్రికి గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల తప్ప మిగతా ఏ ప్రాంతాలు తెలువవు అనుకుంటా..! జనగామ, చేర్యాల ప్రాంతాలను కేసీఆర్ మోసం చేస్తుండు..జనగామ ప్రాంతం కరువు ప్రాంతం..చేర్యాల మున్సిపాలిటీ చేసినవు కానీ....అభివృద్ధి ఏది.. చింతమడకలో ఇంటికో 10లక్షలు ఇచినవ్...పక్కనే ఉన్న చేర్యాల ప్రాంత వాసుల బాధలు నీకు గుర్తుకు రాలేదా..!చేర్యాలలో పేదవారికి ఒక్క ఇల్లు అయిన కట్టించవా..  రైతుబంధు,దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో గద్దెనెక్కి మోసం చేస్తున్నావ్.. చేర్యాలలో 3కోట్లతో రోడ్లు అభివృద్ధికి  సహకరించాం.. 10 లక్షలతో పెద్ద చెరువుకు ఎంపీ లాడ్స్ కింద ఇచ్ఛం..చేర్యాల ఆత్మగౌరవ ఎన్నికలు..  500కోట్లు పెట్టి ప్రగతి భవన్ కడుతావ్.. 100కోట్లు పెట్టి ఫామ్ హౌస్ లో సంక్రాంతికి ఇండ్లు కట్టవ్..కానీ పేదవారికి ఇల్లు కట్టిద్దామని నీకు గుర్తుకురాలేదా.. ఆర్టీసీలో కోటి ఆశలతో తెలంగాణ తెచ్చుకుంటే...ఆశలన్నీ ఆడియశాలు చేశావ్..!  తండ్రి కొడుకులు 50 కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించారు..! దీనిపై బిజెపి కిషన్ రెడ్డికి చెప్పిన పట్టించుకోలేదు.. కాళేశ్వరం మొత్తం బూటకం..అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికే కాళేశ్వరం... సిద్దిపేటలో హరీష్ రావుకే స్థానాచాలనం
లేదు..మొత్తం తండ్రి,కొడుకులదే నడుస్తుంది..  తెలంగాణలో ఉద్యోగులకు ir ఇవ్వకుండా ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.. చేర్యాలలో మినరల్ వాటర్ ప్లాంటులను ఏర్పాటు చేస్తాం.. చేర్యాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా..   కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి.. చేర్యాల రెవిన్యూ డివిజన్   కోసం పోరాడుతం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి,మంత్రి దయాకర్ రావు వచ్చిన ఇక్కడ అడగుపెట్టనియ్యను...  బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు 100 కోట్లు ఇస్తే..ప్రాజెక్టు పూర్తియ్యి.. నీళ్లు వచ్చేవి.. ఎంపీ ఎన్నికల్లో కారు16 అన్నాడు...తన బిడ్డను ఓడగొట్టుకున్నాడు.. తెలంగాణ కాంగ్రెస్ జెండా ఎగురవేసి ప్రభుత్వంన్ని నిలబెడుతం  లక్షన్నర ఉద్యోగాలు కాళీగా ఉన్నాయి...వాటిని పట్టించుకోకుండా కమిషన్లు వచ్చే ప్రాజెక్టుల వైపే చూస్తున్నాడు.. కేసీఆర్  తెలంగాణ కోసం దొంగ దీక్షచేసి ప్రజలను మోసం చేసిండ్రు.. కాంగ్రెస్ పార్టీ తరుపున ఉడుముల ఇన్నమ్మ ను చేర్యాల మున్సిపల్  చైర్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నం..