తెలంగాణలో ఎన్‌ఆర్‌సీ అమలుచేయబోమని తాజాగా స్పష్టం : హోంమంత్రి మహమూద్ అలీ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 16, 2020

తెలంగాణలో ఎన్‌ఆర్‌సీ అమలుచేయబోమని తాజాగా స్పష్టం : హోంమంత్రి మహమూద్ అలీ

లోక్‌సభలో జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ఆర్‌సీ) బిల్లుపై ఓటింగ్‌కు టీఆర్ఎస్‌ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇంతవరకు ఈ చట్టంపై ఎక్కడా మాట్లాడలేదు.ఇటీవల కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని ఆయనతో చెప్పినట్టు మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. కేవలం పాకిస్తాన్,బంగ్లాదేశ్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడ అణచివేతకు గురైనా.. భారత్‌లో వారికి పౌరసత్వం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. అదే సమయంలో ఎన్‌ఆర్‌సీ పేరుతో దేశ ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ మాత్రం తెలంగాణలో ఎన్‌ఆర్‌సీ అమలుచేయబోమని తాజాగా స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న హిందువులకు భారతదేశంలో పౌరసత్వం కల్పించవచ్చునని, కానీ పౌరసత్వం పేరుతో దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకూడదని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడారు.