విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 07, 2020

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం షాక్

14 మంది టీచర్లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో 92 మంది టీచర్లపై త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది.  వీరంతా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్నట్లు అధికారులు గుర్తించారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యా శాఖ వెంటనే చర్యలు తీసుకుంది.సస్పెండైన టీచర్లలో కామారెడ్డిలో ఇద్దరు, నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు, హైదరాబాద్‌లో ఇద్దరు, ఖమ్మంలో ఒకరు, కరీంనగర్‌లో ముగ్గురు, నిర్మల్‌లో ఒకరు, జగిత్యాల జిల్లాలో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న టీచర్లకు ప్రభుత్వం ఘాటు హెచ్చరికలు పంపింది. సర్కారీ స్కూళ్ల మనుగడ రోజురోజుకూ ప్రశ్నార్థకం అవుతున్న వేళ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు.. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం అధికారులతో పాటు అటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. పలు స్కూళ్లలో కొంత మంది టీచర్లు ముందస్తు అనుమతి లేకుండానే సెలవులు పెడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ముఖ్యంగా సెలవు తీసుకొని కూడా హాజరు వేయించుకుంటున్నట్లు తేలింది. ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటూ ఇలా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.