భారతదేశంలోనే ఉత్తమంగా తెలంగాణ పోలీస్.. భాగ్యనగరం దేశానికే రోల్ మోడల్‌ : హోం మంత్రి మహమూద్ అలీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 05, 2020

భారతదేశంలోనే ఉత్తమంగా తెలంగాణ పోలీస్.. భాగ్యనగరం దేశానికే రోల్ మోడల్‌ : హోం మంత్రి మహమూద్ అలీ

రాష్ట్ర పోలీసు విభాగం ఉన్నత పోలీస్ విభాగంగా రూపొందిందని హోం మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. దేశంలోనే ఉత్తమ పోలీస్ వ్యవస్థగా తెలంగాణ పోలీసు వ్యవస్థ ఎదిగిందని పేర్కొన్నారు. శనివారం (జనవరి 4) సాయంత్రం పీపుల్స్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా ఏర్పాటు చేసిన 4 పోలీస్ బ్యాండ్ బృందాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. పౌరులు, పోలీసుల మధ్య సుహృద్భావ వాతావరణం, సత్సంబంధాలు నెలకొల్పడానికి సాంస్కృతిక వారధిగా పోలీస్ బ్యాండ్ బృందాలు కీలక పాత్ర వహిస్తాయని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ శాఖలోని బ్యాండ్ బృందాల ద్వారా ప్రదర్శనలను ఏర్పాటు చేసి పౌరులకు వినోద కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. బ్యాండ్ విభాగాలు ప్రజా సంబంధాలు నెలకొల్పడంలో ముఖ్య భూమిక వహిస్తాయన్నారు. అతి తక్కువ సమయంలో4 కొత్త బ్యాండ్ బృందాలను ఏర్పాటు చేసి ఉత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు డీజీపీ చెప్పారు. స్పెషల్ పోలీస్ బెటాలియన్ వీటిని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కుల, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు పండుగలను కలిసికట్టుగా, ప్రశాంతంగా నిర్వహించుకుంటారని తెలిపారు. తద్వారా భాగ్యనగరం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.