ప్రొఫెసర్ కాశిం కేసులో పోలీసుల సంచలన విశ్లేషణలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 23, 2020

ప్రొఫెసర్ కాశిం కేసులో పోలీసుల సంచలన విశ్లేషణలుప్రస్తుతం కాశిం,ఆయన భార్య స్నేహలత నడుస్తున్న తెలంగాణ అనే సంచికను నడుపుతున్నారు. ఇందుకోసం మావోయిస్టులే నిధులు పంపిస్తున్నారని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. మావోయిస్టులకు కాశింఎన్‌క్రిప్టెడ్ విధానంలో ఈమెయిల్స్ ద్వారా సమాచారాన్ని చేరవేసినట్టు తెలిపారు. కాశింకు సెంట్రల్ బ్యూరో రీజియన్ కార్యదర్శి మల్లోజుల వేణుగోపాల్,కేంద్ర కమిటీ సభ్యులు కట్కం సుదర్శన్,పుల్లూరి ప్రసాదరావు, రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌తో సంబంధాలు ఉన్నట్టు వెల్లడించారు. అంతేకాదు,విచారణలో మావోయిస్టు నేతలతో సంబంధాలను కాశిం ఒప్పుకున్నట్టు తెలిపారు.తెలంగాణ విద్యార్థి వేదిక,తెలంగాణ విద్యార్థి సంఘం,చైతన్య మహిళా సమాఖ్య వంటి 19 సంఘాలతో మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు కాశిం సమన్వయకర్తగా పనిచేస్తున్నారని చెప్పారు. మావోయిస్టు నియామకాల్లో కాశిం కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. మావోలకు అవసరమైన కంప్యూటర్లు,ఆయుధాలు సమకూర్చడంలో కాశిం దిట్ట అని చెప్పారు. తన చర్యలను కప్పి పుచ్చుకునేందుకు కాశిం ప్రొఫెసర్ వృత్తిలో కొనసాగుతున్నట్టు తెలిపారు. కాశిం ఇంట్లో 118 డాక్యుమెంట్లు, 163 సీడీలు, 5 డిజిటల్ వీడియో క్యాసెట్లు,44 జీబీ సామర్థ్యం గల 4 పెన్ డ్రైవ్స్,8జీబీ మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.ల్యాండ్ మైన్ మెటీరియల్ సప్లై. పూర్తి ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేశామని వెల్లడి. 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad