రేపు వరంగల్ లో టెక్‌ మహేంద్రా, సైయెంట్‌ కంపెనీలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 06, 2020

రేపు వరంగల్ లో టెక్‌ మహేంద్రా, సైయెంట్‌ కంపెనీలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

వరంగల్‌ ఐటీ పార్క్‌ ఇప్పటికే ప్రారంభమైంది. కరీంనగర్‌లో ప్రారంభానికి సిద్ధమైనప్పటికీ మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌తో వాయిదాపడింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఐటీ పార్కుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌ తరువాత పెద్ద నగరమైన వరంగల్‌లో ఐటీ పార్కును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసింది మొదలు.. ఇక్కడ ప్రైవేట్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నది. వరంగల్‌ ఐటీ పార్కులో సైయెంట్‌ కంపెనీకి ఐదెకరాల స్థలాన్ని కేటాయించారు. సైయెంట్‌ కంపెనీ ఇప్పటికే ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఇందులో దాదాపు వందమందికిపైగా ఉద్యోగాలు లభించాయి. రెండోదశలో 900 మందికి ఉద్యోగావకాశాలు లభించబోతున్నాయి. దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో మూడంతస్తులతో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సైయెంట్‌ కంపెనీ శాశ్వత భవనాన్ని నిర్మించింది. ప్రతి అంతస్తులో ఆరు వందల మంది విధులు నిర్వహించేందుకు అనుగుణంగా ఒక్కో అంతస్తులో సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ఇప్పటికే ప్రారంభించిన ఇంక్యూబేషన్‌ సెంటర్‌ను శాశ్వత భవనంలోకి మార్చనున్నారు.