పెట్టుబడుల వేటలో కేటీర్ : దిగ్గజ కంపెనీ సీఈఓ లతో భేటీలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 24, 2020

పెట్టుబడుల వేటలో కేటీర్ : దిగ్గజ కంపెనీ సీఈఓ లతో భేటీలు

దావోస్‌లో వరుసగా మూడో రోజు కేటీఆర్‌ పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రముఖులతో సమావేశమయ్యారు. సౌదీ కమ్యూనికేషన్స్‌ మంత్రి అబ్దుల్లా ఆల్‌ స్వాహతో సమావేశమై హైదరాబాద్‌ నగరంలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాల పరిశీలనకు రావాలని ఆహ్వానించారు. మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, డెన్మార్క్‌కు చెందిన మల్టీనేషనల్‌ ఫార్మా కంపెనీ నోవో నోర్‌ డిస్క్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు క్యమీల సిల్వెస్తోతో సమావేశమయ్యారు. రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌), బయోఆసియాతో భాగస్వామ్యానికి సంబంధించి నోవో నోర్‌ డిస్క్‌ కంపెనీతో చర్చించారు. మైక్రాన్‌ టెక్నాలజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సంజయ్‌ మహోత్ర, కోకోకోలా సీఈవో జేమ్స్‌ క్వెన్సి, ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్‌ సీఈవో సుసాన్‌ వొజ్విక్కితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నగరం తమకు ప్రాధాన్యత ప్రాంతమని జేమ్స్‌ క్వెన్సి కేటీఆర్‌కు తెలిపారు.