పెద్దపల్లి కి దేశ అత్యున్నత పురస్కారం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 11, 2020

పెద్దపల్లి కి దేశ అత్యున్నత పురస్కారం

పెద్దపల్లి జిల్లాను మరో జాతీయ పురస్కారం వరించింది. ఇప్పటికే స్వచ్ఛసర్వేక్షణ్‌, స్వచ్ఛసుందర్‌ శౌచాలయ్‌లో జాతీయఅవార్డులు సాధించగా, తాజాగా స్వచ్ఛదర్పణ్‌ అవార్డుకు ఎంపికైంది. జిల్లాలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించి వినియోగించడం, ఇంకుడుగుంతలు నిర్మించి మురుగుకాల్వలు లేకుండా చేయడం, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడం తదితర అంశాల్లో పెద్దపల్లి జిల్లాకు జాతీయస్థాయిలో ప్రథమస్థానం దక్కిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

ఆదివారం ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రత్యేక సెషన్‌లో కలెక్టర్‌ శ్రీదేవసేన స్వచ్ఛదర్పణ్‌ అవార్డును తీసుకోనున్నారు . స్వచ్ఛతలో పెద్దపల్లి జిల్లా దేశానికే ఆదర్శంగా నిలువడం గర్వంగా ఉన్నదని, ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం.. క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే ఈ అవార్డు వచ్చిందని కలెక్టర్‌ శ్రీ దేవసేన తెలిపారు.