షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తు కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పది నుంచి 12వరకు నామినేషన్లు స్వీకరించి 24న పోలింగ్ నిర్వహించి, 27న ఓట్ల లెక్కింపు చేపడతారు. రెండు రోజులు ఆలస్యమైనా ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ కావడంతో రాజకీయ పార్టీలతోపాటు అశావాహులు నామినేషన్ వేసే పనిలో నిమగ్నమయ్యారు.
టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన మంత్రి గంగుల కమలాకర్, బి ఫామ్‌లు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. అటు బిజేపి అభ్యర్థులను ఎంపి బండి సంజయ్ ఎంపిక చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో 16మందితో కూడిన ఎన్నికల కమిటీ ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యింది. శుక్రవారం రాత్రిలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి వారంరోజుల పాటు జోరుగా ప్రచారం చేయనున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు నెలకొనడం, రెండు రోజులు ఆలస్యంగా ఎన్నికలు జరుగుతుండడంతో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి నిర్లక్ష్యంపై రాజకీయ పార్టీల నేతలతోపాటు నగర ప్రజలు మండిపడుతున్నారు. కమిషనర్‌పై చర్యలకు అటు ప్రభుత్వం సిద్దమయ్యింది. కాగా ఎట్టకేలకు నోటిపికేషన్ జారీ కావడంతో కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి నగరంలో సందడి నెలకొంది.