తెలంగాణ ప్రభుత్వ విద్య విధానం ,వసతులు సరిగా లేవని కమీటీ నివేదిక - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 20, 2020

తెలంగాణ ప్రభుత్వ విద్య విధానం ,వసతులు సరిగా లేవని కమీటీ నివేదిక

తెలంగాణ రాష్ట్రంలో 49శాతంకు పైగా స్కూళ్లల్లో నాల్గవ తరగతి చదివే విద్యార్థులు తమ క్లాస్‌రూంలలో కాకుండా ఇతర తరగతి విద్యార్థులతో కలిసి కూర్చుంటున్నారని నివేదిక వెల్లడించింది. దాదాపు 60.5శాతం మంది రెండో తరగతి చదివే విద్యార్థులు మరో తరగతి విద్యార్థులతో కలిసి కూర్చుంటున్నారు. 2010 నుంచే ఇలా ఒక తరగతికి చెందిన విద్యార్థులు మరో తరగతి విద్యార్థులతో కలిసి ఒకే గదిలో కూర్చుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని 259 ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయాలు బయటకు వచ్చాయి.2018 నాటికి 42.8శాతం తెలంగాణలోని స్కూళ్లకు తాగునీటి వసతి లేదని నివేదిక తెలపింది. ఏళ్లు గడిచే కొద్దీ చాలా స్కూళ్లలో సురక్షితమైన తాగు నీరు కొరత కనపడిందని సర్వే వెల్లడించింది. నవంబర్ నెలలో విద్యార్థులు మంచి నీరు తాగాలని చెబుతూ వాటర్ బెల్‌‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తెలంగాణ స్కూళ్లల్లో టాయ్‌లెట్ల వినియోగం పెరిగిందని నివేదిక వెల్లడించింది. 2010లో 38.6శాతం మాత్రమే టాయ్‌లెట్స్‌ను వినియోగిస్తుండగా 2018 నాటికి అది 77శాతంకు చేరుకుందని లెక్కలు వివరిస్తున్నాయి. ఆడపిల్లలకు సెపరేట్ టాయ్‌లెట్స్ నిర్మాణం కూడా పెరిగిందని సర్వే స్పష్టం చేసింది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )