మేడ్చల్ జిల్లా ప్రతినిధి: జనవరి 19వ తేదీ ఆదివారంనాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన 25వ విడత పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా కాప్రా మండల్ గాంధీనగర్ గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలకు పోలియో చుక్కలు వేసిన గాంధీనగర్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్
జి. సత్యనారాయణ .
ఈ సందర్భంగా జి. సత్యనారాయణ గారు మాట్లాడుతూ 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తమ బంగారు భవిష్యత్తు కోసం రెండు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.