మో డల్‌ స్కూల్‌లలో 2019-20 నుంచి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ హాజరు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 23, 2020

మో డల్‌ స్కూల్‌లలో 2019-20 నుంచి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ హాజరు

మోడల్‌స్కూళ్లలో ప్రవేశాల కోసం విద్యార్థులు అమితాసక్తి చూపుతున్నారు. దీం తో ఏటా  సీట్లకు పోటీ నెలకొంటున్నది. వా రంలో అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి మో డల్‌ స్కూల్‌సొసైటీ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం, 7 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు క్యాటగిరీలవారీగా రిజర్వేషన్ల విధానం అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో 194 మోడల్‌స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 1.35 లక్షల సీట్లు ఉన్నాయి. 2015-16లో 86,180 మంది, 2019-20లో 1,32,116 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. 2015-16 నుంచి ఏటా ప్రవేశాలు పెరుగుతున్నాయి. గత పది ఫలితాల్లో మోడల్‌స్కూ ల్‌ విద్యార్థులు.. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా 98.45 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలంగాణ మోడల్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు. బాలికల కోసం 100 స్కూళ్లలో హాస్టళ్లను ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. 2019-20 నుంచి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ హాజరు   అమలుచేస్తున్నట్టు వెల్లడించారు. 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )