తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లిన కారు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 16, 2020

తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లిన కారు

వనపర్తి రూరల్ పోలీస్టేషన్ పరిధిలోని మర్రికుంట యూకో పార్కు వద్ద మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద స్టాటికల్ సర్వేలైన్ టీం విధులు నిర్వహిస్తోంది. ఈ సమయంలో పెబ్బేరు వైపు నుంచి TS 329778 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు వేగంగా వచ్చి పోలీసుల మీదకు దూసుకొచ్చింది.కారు నేరుగా హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ సలీం ఖాన్ మీదికి దూసుకెళ్లడంతో ఆయన తలకు తీవ్రమైన గాయమైంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సలీంను సహచరులు హుటాహుటిన వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృత్యువాతపడ్డారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ పోలీస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సలీం ఖాన్.. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో SST స్టాటికల్ సర్వేలైన్ బృందంలో ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు. వేగంగా వచ్చిన ఓ కారు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లడంతో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. వనపర్తి జిల్లా మర్రికుంటలో జనవరి 13 రాత్రి 10.40 గంటలకు ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..