చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న విద్యార్థులు మరియు ప్రజాసంఘాలు.... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 27, 2020

చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న విద్యార్థులు మరియు ప్రజాసంఘాలు....హైదరాబాద్ ప్రతినిధి :పౌరసత్వ సవరణ చట్టం (CAA), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్ పిఆర్), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ టిపిసి) లకు వ్యతిరేకంగా టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీడీఎస్) నిర్వహించ తలపెట్టిన సమావేశంలో ప్రసంగించేందుకు వచ్చిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ను ఆదివారం నాడు పోలీసులు అరెస్టు చేశారు.

మెహదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్ లో అఖిల భారత దళిత ముస్లిం ఆదివాసీ అభ్యుదయ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆజాద్ పాల్గొనాల్సి ఉంది. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలియడంతో పలు విద్యార్ధి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.

Post Top Ad