తెలంగాణతో థాయ్‌ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 19, 2020

తెలంగాణతో థాయ్‌ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం

 రబ్బర్‌ వుడ్‌, టింబర్‌ వుడ్‌ ఉత్పత్తుల రవాణా కోసం 400 కి. మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉందని, రవాణా సబ్సిడీలు కూడా అందిస్తామని తెలిపారు. బ్యాంకాక్‌-హైదరాబాద్‌ విమాన సర్వీసులు పెంచి పర్యాటకాన్ని అభివృద్ధి చెందేలా ప్రొత్సహించాలని అన్నారు. అనంతరం కేటీఆర్‌ జరీన్‌ లక్సనావిత్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని  భారత్‌ పర్యటన పెట్టుబడులకు ఊతం ఇచ్చేలా ఉందన్నారు. తెలంగాణలో ఫుడ్‌ ప్రసెసింగ్‌కు సరిపడా నీటి వనరులు ఉన్నాయన్నారు. ఫర్నీచర్‌ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెడుతున్న థాయ్‌లాండ్‌.. రాష్ట్రంలో నూతన  ఆవిష్కరణలు పరిచయం చేయాలని సూచించారు.