నర్సాపూర్ మండల కేంద్రం సమీపన గాడి ప్రభాకర్‌కు చెందిన పొలంలో శనివారం రాత్రి చిరుత పులి అడుగులను రైతు ప్రభాకర్ గుర్తించారు. సమాచారాన్ని వెంటనే అటవీ శాఖ అధికారులకు అందజేశారు. సంఘటన స్థలాన్ని డిప్యూటీ ఎఫ్ఆర్వో గౌత్ పరిశీలించి చిరుత పులి అడుగులుగా నిర్ధారించారు. మండలంలోని, అంజనితండా కుస్లి, గోల్లమాడ గ్రామాల్లో చిరుత పులి ఆవులను, మేకలను హతమార్చింది. సమీప గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )