కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 27, 2020

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ వెల్లడి


చైనాను కబళిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రమేపీ తన ప్రతాపాన్ని చూపుతోంది. చైనాలో ఇప్పటికే ఈ వైరస్ వ్యాధి సోకి మరణించినవారి సంఖ్య 80 కి పెరగగా.. సుమారు రెండున్నరవేల మంది దీని ప్రభావానికి గురయ్యారు. కాగా.. ఇండియాలో వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమయింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ఇప్పటివరకు మన దేశంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి పాజిటివ్ కేసు కూడా కనబడలేదన్నారు. చైనా నుంచి వచ్చిన ఏడుగురు ప్రయాణికుల రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు ఆయన చెప్పారు. అలాగే ఇరవై నాలుగు గంటలూ ఓ కాల్ సెంటర్ పని చేస్తోందన్నారు. ఈ నెల 1 నుంచి చైనాకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరైనా జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ రుగ్మతలతో బాధ పడుతుంటే వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని హర్ష వర్ధన్ కోరారు. ఇక ఢిల్లీ సహా ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చి , కోల్ కతా, చెన్నై విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేశారు.ఇలా ఉండగా కేరళ, మహారాష్ట్రలో సుమారు రెండు వందల మందిని ముందు జాగ్రత్త చర్యగా ]అబ్జర్వేషన్ లో ఉంచారు. కేరళలో 172 మందిని హోం నిఘాలో ఉంచగా.. ఏడుగురిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. చైనా నుంచి పాట్నా చేరిన ఒక అమ్మాయిని, అలాగే ఆ దేశం నుంచి రాజస్తాన్ కు వఛ్చిన ఓ డాక్టర్ ను కూడా ఎందుకైనా మంచిదని ఆసుపత్రికి తరలించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad