KTR కి నేను PA అంటూ లక్షలలో జనాలకు టోపీ ..? - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 23, 2020

KTR కి నేను PA అంటూ లక్షలలో జనాలకు టోపీ ..?




KTR కి నేను PA అంటూ లక్షలలో జనాలకు టోపీ పేదవాడైన ఓ జూనియర్‌ క్రికెటర్‌కు సాయం చేయాలని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు రూ.3.3 లక్షలు టోకరా వేశాడు. అంతేకాక, మరో రూ.2 లక్షలు కావాలని అడిగే ప్రయత్నింలో దొరికిపోయాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు డిసెంబర్‌ 16న గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. తాను కేటీఆర్‌ వద్ద పీఏగా పని చేస్తున్నానని, ఆయన కార్యాలయం నుంచే మాట్లాడుతున్నట్లు నమ్మబలికాడు. ఏపీకి చెందిన బుడుమూరు నాగరాజు అనే రంజీ ఆటగాడు అండర్‌ 25 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యాడని.. ఆయనకు తక్షణం రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించాలని కోరాడు. మీడియా, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ సాయాన్ని అందించాలని నమ్మబలకగా, రియల్ యజమాని అది నిజమేనని నమ్మాడు. దీనిద్వారా సంస్థకు పేరు ప్రఖ్యాతులు దక్కుతాయని నమ్మబలికాడు. నకిలీ పీఏ చెప్పినదంతా నిజమని నమ్మిన ఆ సంస్థ యజమాని రూ.3.3 లక్షలను పీఏ ఖాతాలో జమ చేశాడు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad