డేటాబేస్‌ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కి Paytm - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 26, 2020

డేటాబేస్‌ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కి Paytmదేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు వివిధ పేర్ల మీద ఫోన్ కాల్స్ చేసి, వారిని ఆర్థికపరంగా మోసగిస్తున్న ఫ్రాడ్ చేసే వ్యక్తుల కొన్ని ఫోన్ నెంబర్లను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆ సంస్థ సమర్పించింది. పేటీఎం దృష్టికి వచ్చిన మొత్తం 3,500 ఫోన్ నెంబర్లను TRAIకి అందజేయడం జరిగింది. అలాగే అదే డేటాబేస్‌ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కి Paytm ఇచ్చింది.
అంతటితో సరిపెట్టుకోకుండా, నోయిడాలోని సైబర్ పోలీస్ స్టేషన్ లో ఆ 3500 నెంబర్ ల మీద పోలీస్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. వినియోగదారుల మీద జరుగుతున్న ఫ్రాడ్‌కి ఎంతోకొంత ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం అడ్డుకునే అవకాశం ఉందని Paytm అభిలషిస్తోంది. కేవలం ఫోన్ నెంబర్లు మాత్రమే కాకుండా టెలికం వినియోగదారులకు ఫ్రాడ్ చేసే వ్యక్తులు పంపిస్తున్న SMS Shortcodeల సమాచారాన్ని కూడా ఆ సంస్థ ట్రాయ్‌కి అందించడం జరిగింది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad