యాదాద్రిలో హోరాహోరీ పోటీ నడుమ చైర్మన్‌ పీఠాన్ని దక్కించున్న TRS - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 28, 2020

యాదాద్రిలో హోరాహోరీ పోటీ నడుమ చైర్మన్‌ పీఠాన్ని దక్కించున్న TRS

యాదాద్రి లో ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగాయి. ఎక్స్‌అఫిషియో సభ్యుల బలంలో టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంది.  12 వార్డులకు  టీఆర్‌ఎస్‌ 4 చోట్ల గెలువగా, ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్రె ప్రభాకర్, కడియం శ్రీహరి, ఇండిపెండెంట్‌ సభ్యులతో కలిపి టీఆర్‌ఎస్‌ బలం 8 కి చేరింది. అయితే కాంగ్రెస్‌ కూటమిలో కాంగ్రెస్‌ 4, సీపీఐ 1, ఇండిపెండెంట్లు ఇద్దరు కౌన్సిలర్‌లతో బలం 7కు చేరింది. టీఆర్‌ఎస్‌ తరపున చైర్‌పర్సన్‌గా ఎరకల సుధ, కాంగ్రెస్‌ నుంచి గుండ్లపల్లి వాణి పోటీపడ్డారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఎనిమిది ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఏడు ఓట్ల వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. వైస్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ కూటమిలో ఉన్న ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ కాటంరాజు ఎన్నికయ్యారు.

Post Top Ad