త్వరలో అమలులోకి TS BPASS - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 17, 2020

త్వరలో అమలులోకి TS BPASS


మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రభుత్వభూములు, వక్ఫ్‌ స్థలాలు, మున్సిపల్‌ స్థలాలు, లేఅవుట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌, మంచినీటి కుంటలు.. ఇలా ప్రతి స్థలానికి సంబంధించిన డాటాను తీసుకుని డీటీసీపీ ఒక జాబితాను రూపొందించింది. ఈ మొత్తం సమాచారాన్ని ప్రస్తుతం ఇంటిగ్రేట్‌ చేశారు. దీంతో, టీఎస్‌-బీపాస్‌కు సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. అంతకంటే ముందు రాష్ట్రంలోని నిర్మాణసంఘాల ప్రతినిధులతో డీటీసీపీ అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. టీఎస్‌-బీపాస్‌ను మరింత సమర్థంగా అమల్లోకి తీసుకువచ్చేందుకు వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. అనుమతుల్ని ఆన్‌లైన్‌లో మంజూరుచేసే క్రమంలో ఎదురయ్యే వాస్తవిక సమస్యలను పలువురు డెవలపర్లు డీటీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. వారి సూచనలు, సలహాలు తీసుకుని.. టీఎస్‌ బీపాస్‌లో మార్పులు, చేర్పులుచేశారు. త్వరలో అమల్లోకి తీసుకురానున్న బీ పాస్‌పై డెవలపర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )