మున్సిపల్‌ బడ్జెట్లలో 10 శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌గా కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2020

మున్సిపల్‌ బడ్జెట్లలో 10 శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌గా కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వెల్లడి


తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పెంపొందించేందుకు మున్సిపల్‌ బడ్జెట్లలో 10 శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌గా కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కేంద్రంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పట్టణ ప్రగతిలో స్థానికులకు భాగస్వామ్యం కల్పించేందుకు ప్రతి మున్సిపల్‌ వార్డులో ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులతో మొత్తం నాలుగు కమిటీలు నియమించినట్టు చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని లెనిన్‌నగర్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )