నిరుద్యోగ నిర్ములనే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కసరత్తులు : 10 వేల నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్ల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

నిరుద్యోగ నిర్ములనే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కసరత్తులు : 10 వేల నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్ల పంపిణీ

తెలంగాణ : నిరుద్యోగ నిర్ములనే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ కసరత్తులు , వీటిలో భాగంగానే  పదివేల మంది నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్ల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. అన్ని జిల్లాల బీసీ సంక్షేమ అధికారులతో మంత్రి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... చదువుకున్న నిరుద్యోగ యువతులకు నిఫ్ట్‌ ద్వారా శిక్షణ, ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు అంబులెన్స్‌లు అందజేయనున్నట్లు చెప్పారు. ఐదుగురు యువత ఒక గ్రూప్‌గా అంబులెన్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద జిల్లాకొక అంబులెన్స్‌ను కేటాయించనున్నట్లు తెలిపారు. 11 సమాఖ్యల ద్వారా వివిధ వృత్తుల వారికి ఆయా రంగాల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. బీసీ విద్యార్థుల భవిష్యత్‌ కోసం అధికారులు కలిసి పనిచేయాలన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. పట్టణప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు వసతి గృహాలను సందర్శించాలని మంత్రి కోరారు. సంక్షేమ వసతిగృహాల ప్రగతికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిచనున్నట్లు తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )