తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లిలో రూ.117.25 కోట్లతో శాటిలైట్‌ టెర్మినల్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 24, 2020

తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లిలో రూ.117.25 కోట్లతో శాటిలైట్‌ టెర్మినల్‌


తెలంగాణ రాష్ట్రంలోని  చర్లపల్లిలో రూ.117.25 కోట్లతో శాటిలైట్‌ టెర్మినల్‌ నిర్మాణ పనులకు టెండర్లు ఖరారయ్యాయి. దీన్ని రెండు దశల్లో నిర్మించనున్నారు. ఫేజ్‌-1లో రూ.54.58 కోట్లతో, రెండో దశలో రూ.62.67 కోట్లతో పనులు చేయనున్నారు. నూతనంగా రైల్వే ప్రవేశపెట్టనున్న ప్రైవేట్‌ రైళ్లను కూడా ఇక్కడి నుంచే ఆపరేట్‌ చేయనున్నారు. ఎంఎంటీఎస్‌ రెండోదశ విస్తరణలో భాగంగా ఘట్‌కేసర్‌, సనత్‌నగర్‌, యాదాద్రి వరకు సబర్బన్‌ రైళ్లు నడువనుండటంతో ఈ టెర్మినల్‌లో దిగిన ప్రయాణికులు వీటి ద్వారా నగరంలోని ఇతర ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఈ శాటిలైట్‌ టెర్మినల్‌ కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయించారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )