తెలంగాణాలో ఏరులై పారుతున్న లక్షల లీటర్ల కల్తీ మద్యం : 1.2 లక్షల ‘ఆఫీసర్స్ ఛాయిమస్ విస్కీ’ బాటిల్ మూతలను స్వాధీనం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 09, 2020

తెలంగాణాలో ఏరులై పారుతున్న లక్షల లీటర్ల కల్తీ మద్యం : 1.2 లక్షల ‘ఆఫీసర్స్ ఛాయిమస్ విస్కీ’ బాటిల్ మూతలను స్వాధీనం


తెలంగాణాలో ఏరులై పారుతున్న లక్షల  లీటర్ల కల్తీ మద్యం .  ‘ఆఫీసర్ ఛాయిస్ విస్కీ’ బదులు పెద్ద ఎత్తున కల్తీ విస్కీ విక్రయించే ఓ ముఠా ఎక్సైజ్ శాఖకు చిక్కింది. ఎక్సైజ్ అధికారులు ఇటీవల రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో మహేందర్ అనే వ్యక్తి దగ్గర్నుంచి 1.2 లక్షల ‘ఆఫీసర్స్ ఛాయిమస్ విస్కీ’ బాటిల్ మూతలను స్వాధీనం చేసుకున్నారు. రెక్టిఫైడ్ స్పిరిట్‌ను, వందల సంఖ్యలో ఖాళీ 180 ఎంఎల్ బాటిళ్లను కూడా అతడి దగ్గర్నుంచి స్వాధీనం చేసుకున్నారు.ఒరిజినల్ విస్కీ బాటిళ్లను కొనుగోలు చేసి.. అందులోని కొంత మద్యాన్ని నీళ్లను కలిపి మళ్లీ బాటిళ్లను ప్యాకింగ్ చేయడం ఒక తరహా కల్తీ అయితే.. రెక్టిఫైడ్ స్పిరిట్‌ ఉపయోగించడం రెండో తరహా కల్తీ అని అధికారులు తెలిపారు. ఈ రాకెట్లో మరింత మందికి ప్రమేయం ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఈ ముఠా భారీ ఎత్తున కల్తీ విస్కీని విక్రయిస్తోందని సమాచారం.  కర్ణాటకలోని కొందరు వ్యక్తుల దగ్గర్నుంచి ఒక్కో మూతకు రూ.6 చొప్పున కొనుగోలుచేసి , స్క్రాప్ దుకాణాల నుంచి ఖాళీ 180 ఎంఎల్ బాటిళ్లు, కర్ణాటక నుంచి మూతలను సమకూర్చుకున్న తర్వాత.. ముఠా  తయారు చేయడాన్ని ప్రారంభించింది అని సమాచారం. రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కల్తీ విస్కీ తయారు చేసి.. దాన్ని బాటిళ్లలో నింపి.. సీల్ చేస్తారు. వీటిని అక్రమ బెల్ట్ షాపులు, రిటైల్ దుకాణాలకు విక్రయిస్తారని అధికారులు తెలిపారు.
ఈ ముఠా ఒక్కో కల్తీ విస్కీ బాటిల్‌ను ఎంఆర్పీ కంటే రూ.10 నుంచి రూ.15 వరకు తక్కువ ధరకు విక్రయిస్తోంది. కంపెనీ నుంచి నేరుగా కొనుగోలు చేశాం కాబట్టి తక్కువ ధరకు లభ్యమైందని షాపుల వాళ్లను నమ్మిస్తోంది. ఎక్సైజ్ అధికారులకు దొరికిన మహేందర్ కూడా కల్తీ విస్కీని తయారు చేసి రిటైల్ షాపులకు సరఫరా చేస్తున్నాడని గుర్తించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )