13 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2020

13 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ఆఫీసులో ఎన్నికల విధులకు సంబంధించిన సీ సెక్షన్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ విజయలక్ష్మీ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. జిల్లాలోని తిమ్మాజీపేట మండలం మారేపల్లిలోని సర్వే నెంబర్‌ 15లో గల రెండు ఎకరాల వివాద భూమి పట్టా చేస్తానని వెంకటయ్య అనే వ్యక్తిని నమ్మించింది. అందుకు రూ. 13 లక్షలు డిమాండ్‌ చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అవినీతి నిరోదక శాఖ అధికారులు ఈ రోజు కలెక్టరేట్‌లో వెంకటయ్య నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన అధికారిని రెవెన్యూకు సంబంధించిన పని చేసి పెడతానని ఎలా లంచం డిమాండ్‌ చేసింది, డిప్యూటీ తహసీల్దార్‌ వెనుక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )