మూసి నది అభివృద్ధికి 15వేల కోట్లతో ప్రణాళికలు : దాదాపు హైదరాబాద్ మెట్రో నిర్మాణ నిధులతో సమానమైన నిధులు కేటాయింపు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

మూసి నది అభివృద్ధికి 15వేల కోట్లతో ప్రణాళికలు : దాదాపు హైదరాబాద్ మెట్రో నిర్మాణ నిధులతో సమానమైన నిధులు కేటాయింపు

 తెలంగాణ : మూసి నది అభివృద్ధికి  15వేల కోట్లతో ప్రణాళికలు : దాదాపు హైదరాబాద్ మెట్రో నిర్మాణ నిధులతో సమానమైన నిధులు కేటాయింపు.   హైదరాబాద్ లోని మూసీ నది ప్రక్షాళనలో భాగంగా గురువారం కీలక ఘట్టం జరుగనుంది . ఢిల్లీలో నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో జలమండలి ఎండీ దానకిశోర్‌ మూసీ నది సమూల ప్రక్షాళనపై తీసుకోవాల్సిన కార్యాచరణపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్నారు. ఈమేరకు ఎండీ దానకిశోర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్‌-2 శ్రీధర్‌ బాబు, సీజీఎం ప్రసన్నకుమార్‌  ఢిల్లీకి చేరుకున్నారు. ఈ మూసీ పథకాలకు కేంద్ర జలశక్తి అభియాన్‌, ఎన్‌ఆర్‌సీడీ (జాతీయ నదీ పరిరక్షణ, అభివృద్ధి ) పథకాల కింద 60 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతితెలిసిందే . ఇందులో భాగంగానే జలమండలి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కింద మొత్తం నది క్యాచ్‌మెంట్‌ ఏరియా అభివృద్ధికిగాను దాదాపు రూ. 15వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు గత నెలలో ఎన్‌ఎంసీజీ (నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా) డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నగరంలో రెండు రోజుల పర్యటన చేశారు. మూసీ ప్రక్షాళనకు పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధి చేసే కేంద్రాలు, మురుగునీటిని ఎస్టీపీలకు మళ్లించేందుకు భారీ ట్రంక్‌ సీవర్‌, సబ్‌మెయిన్స్‌, పైపులైన్లు ఏర్పాటు చేయడం, సుందరీకరణ పనులు చేపట్టడం, మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఈటీపీల నిర్వహణ తదితర పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. రూ. 13, 479 కోట్ల అంచనాతో జలమండలి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను అధికారులు మిశ్రాకు నివేదించారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )