కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో పర్యటన - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 14, 2020

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో పర్యటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ఫిబ్రవరి 16, 17 తేదీల్లో  హైదరాబాద్, బెంగళూరులో పర్యటిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. గతవారం ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో నిర్వహించిన ఇలాంటి ఇంటరాక్టివ్ సెషన్లలో మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. బడ్జెట్‌లో ప్రభావితం కానున్న వర్గాలను మంత్రి నిర్మలా సీతారామన్ కలవనున్నారు. మొదటి సెషన్‌లో ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. రెండో సెషన్‌లో ఆర్థికవేత్తలు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు తదితరులతో భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న లోక్ సభలో నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇప్పటి వరకు ఈ బడ్జెట్‌ ప్రసంగమే అత్యంత సుదీర్ఘమైంది. బీజేపీ ప్రభుత్వం ‘జన్‌ జన్‌కా బడ్జెట్‌’గా పేర్కొంటున్న ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, నీటి పారుదల, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా రంగాలకు చెందిన నిపుణుల అభిప్రాయాలు ఆర్థిక మంత్రి తెలుసుకోనున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )