సీఎం కెసిఆర్ అధ్యక్షతన ఫిబ్రవరి 16 న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 15, 2020

సీఎం కెసిఆర్ అధ్యక్షతన ఫిబ్రవరి 16 న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 16 న భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించి తేదీలను ఖరారు చేయనున్నారు. మార్చి మొదటి వారంలో బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందించే అంశంపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని నీటి పారుదల వ్యవస్థను 11 సర్కిళ్లుగా పునర్వ్యవస్థీకరించాలని కాళేశ్వరం పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  మంత్రివర్గ భేటీలో ఈ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గల్ఫ్ బాధితుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.కొత్త రెవెన్యూ చట్టం అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )