పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2020

పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

సదాశివపేటలోని 16వ వార్డులో జరిగిన పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారందరికీ ఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, కలెక్టర్‌ హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. 6 నెలల్లో సదాశివపేటలో నీటి సమస్యలేకుండా చూస్తామని తెలిపారు. కొత్తగా వచ్చిన మున్సిపల్‌ చట్టం ప్రజలకు భరోసా ఇస్తుందన్నారు. మున్సిపల్‌ చట్టంతో పారద్శకత పెరుగుతుందన్నారు. 75 గజాలలోపు ఇల్లు కట్టాలంటే రూపాయి ఫీజు కడితే చాలన్నారు. అదే 250 గంజాలలోపు ఇల్లు కడితే సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇస్తే చాలన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రతి మున్సిపాలిటీకి ఉన్నతాధికారిని నియమించినట్లు తెలిపారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )