మొదలవనున్న నిఖిల్‌ "కార్తికేయ - 2 " - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 29, 2020

మొదలవనున్న నిఖిల్‌ "కార్తికేయ - 2 "

హీరో నిఖిల్‌, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తికేయ చిత్రం ఎంతగా హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ కార్తికేయ క్రేజే వేరు. ఇక సోషల్ మీడియాలో దీని సీక్వెల్‌ ఎప్పుడంటూ అభిమానులు కురిపించే ప్రశ్నలకు లెక్కే లేదు. ‘ఏనిమల్‌ హిప్నటిజం’ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇన్నాళ్లకు వీళ్లిద్దరూ మరోసారి కార్తికేయ2 సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు, ‘అర్జున్‌ సురవరం’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రం తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న నిఖిల్‌ తిరిగి కార్తికేయ 2కి శ్రీకారం చుట్టాడు. ఇక మార్చి 2న తిరుమల శ్రీవారి సన్నిధిలో పూజాకార్యక్రమాలు జరుపుకున్న అనంతరం షూటింగ్‌ ప్రారంభిస్తామని చిత్రబృందం తెలిపింది. ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలందించిన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. అగ్రనిర్మాతలు టిజి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నానమని పేర్కొన్నారు. వివేక్‌ కూచిబొట్ల సహ నిర్మాత.
'

వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )