కుషాయిగూడ పరిధిలోని హెచ్.బి కాలనీ లో మల్కాజిగిరి డిసిపి రక్షితా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 200 మంది పోలీసుల తో కార్డాన్ అండ్ సెర్చ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 29, 2020

కుషాయిగూడ పరిధిలోని హెచ్.బి కాలనీ లో మల్కాజిగిరి డిసిపి రక్షితా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 200 మంది పోలీసుల తో కార్డాన్ అండ్ సెర్చ్


మేడ్చల్ జిల్లా ప్రతినిధి :కుషాయిగూడ పోలీస్ స్టషన్ పరిధిలోని హెచ్.బి కాలనీ లో మల్కాజిగిరి డిసిపి రక్షితా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 200 మంది పోలీసుల తో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో  పేపర్స్ లేని 29 ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు.ముగ్గురు అనుమానితులను, ఒక రౌడీ షీటర్ ని అదుపులోకి తీసుకున్నారు.
డీసీపీ మహిళలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు,ఎవరన్నా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.రాత్రి సమయంలో కొంతమంది మద్యం,గంజాయి సేవించి మహిళను వేధిస్తున్నారని స్థానిక మహిళలు తెలిపారు.రాత్రి సమయంలో పెట్రోలింగ్ వేకల్ పెంచి ప్రత్యేక దృష్టి పెడతామని డీసీపీ తెలిపారు.