అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ సహా కొన్ని కీలక నిర్ణయాలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్లో మంత్రివర్గం సమావేశమైంది. సుమారు 6 గంటల పాటు కేబినెట్ భేటీ సాగింది. ఇందులో పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి నిర్వహణపై కీలక చర్చలు జరిగాయి. సీఏఏకు వ్యతిరేక తీర్మానం చేయాలని కూడా నిర్ణయించారు.ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు ఈ నెల 18న ప్రగతి భవన్లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు నిర్వహించనున్నారు. పట్టణ ప్రగతి నిర్వహణపై కేబినెట్ భేటీలో విస్తృత చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పట్టణాల్లో పచ్చదనం పారిశుద్ధ్యం వెల్లివిరియడమే లక్ష్యంగా కార్యక్రమం సాగాలని సీఎం ఆకాంక్షించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )