సుమారు 25 మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులు పంపిన హైదరాబాద్ కలెక్టర్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2020

సుమారు 25 మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులు పంపిన హైదరాబాద్ కలెక్టర్‌

తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అత్యధికంగా అధికారులు హాజరు కాకపోవడంతో కలెక్టర్‌ శ్వేతా మహంతి సీరియస్‌ అయ్యారు. ప్రజావాణికి హాజరు కాని సుమారు 25 మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీకి ఆదేశాలిచ్చారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతివారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని అల్టిమేటం ఇచ్చారు. ఇక మీదట హాజరు కాకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమ ప్రాంగణానికి కలెక్టర్‌ చేరుకునే సరికి కనీసం పది మంది అధికారులు సైతం హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )