మెదక్ జిల్లాలో ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు : ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 19, 2020

మెదక్ జిల్లాలో ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు : ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

మెదక్ జిల్లాలో ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి . వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి.. చత్రపతి శివాజీకి నివాళులర్పించారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )