తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలలో నేటి నుండి మార్చి 4వ తేదీ వరకు పల్లె ప్రగతి జరుగుతుందని ప్రకటించారు. మహబూబ్నగర్ పట్టణ ప్రగతిలో తాను పాల్గొంటానని వెల్లడించారు. ఆయా పట్టణాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. పట్టణప్రగతి కార్యక్రమానికి సంబంధించి మంత్రి కేటీఆర్ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇదివరకు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమవడంతో.. అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతి పనులు సమీక్షించేందుకు ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంతో పౌరసేవలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేయాలని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొనేందుకు నిబద్ధతతో పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )