జూబ్లీహిల్స్ రోడ్డు నం 45 లో ట్రాఫిక్ ఆంక్షలు : పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

జూబ్లీహిల్స్ రోడ్డు నం 45 లో ట్రాఫిక్ ఆంక్షలు : పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. 3 నెలల పాటు ఇవి అమల్లోకి ఉండనున్నాయి . ఎందుకంటే దుర్గం చెరువు రూట్‌లో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడమే కారణం. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల చేశారు. 
  •  రోడ్డు నెంబర్ 45 జూబ్లిహిల్స్ నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లే వాహనాలు రోడ్డ్ నెంబర్ 52, రోడ్డు నెంబర్ 46 మార్గం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
  •  రోడ్డు నెంబర్ 49 నుంచి వచ్చే వాహనాలు..రోడ్డు నెంబర్ 45 మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.  20 - 05 - 2020 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 

ఈ రోడ్లలో చేపట్టాల్సిన చర్యలపై ట్రాఫిక్ సిబ్బందికి ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ శిఖా గోయల్ పలు సూచనలు చేశారు.
  • ట్రాఫిక్ నియంత్రణకు ప్రైవేటు సెక్యూర్టీ సిబ్బంది సహకరించాలి. పెద్ద ఎత్తున సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. రేడియం బోర్డులు ఏర్పాటు చేయాలి. 
  •  ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. 
  •  పనులు జరుగుతున్న ప్రదేశంలో లైట్లు ఏర్పాటు చేయాలి. సరైన భద్రతా చర్యలు చేపట్టాలి. 
  • R & B మార్గదర్శకాల ప్రకారం నిర్మాణాలు జరగాల్సి ఉంటుంది. 
  • పనులు ముగిసిన అనంతరం రీ కార్పెంటింగ్ పనులు త్వరగా పూర్తి కావాలి. 




( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )