తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివెల్లండించారు . ఆయిల్‌పాం సాగు అనుమతి కోసం తెలంగాణ పెట్టిన ఫైలుకు అనుమతి లభించింది అని తెలిపారు . ఆయిల్‌పాం సాగుకు కేంద్రం అనుమతి నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని హాకాభవన్‌లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రానున్న రెండేండ్లలో 45,250 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం లేఖ పంపిందని తెలిపారు. విదేశీ మారకాన్ని ఆదాచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పాం సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే పంటకాలనీల ఏర్పాటుకు సంబంధించిన నివేదిక సిద్ధమైందని వెల్లడించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయహోదా కల్పించి తోడ్పాటునందించాలని మంత్రి విజ్ఞప్తిచేశారు. రైతులను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యవసాయంలో పథకాలను ప్రవేశపెడుతున్నారని, ఆయన నాయకత్వంలో వ్యవసాయం స్వరూపమే మారిపోయిందన్నారు. కంది రైతులు ఆందోళన చెందవద్దని, కందుల కొనుగోలుపై కేంద్రానికి విజ్ఞప్తిచేశామని తెలిపారు. కందులన్నింటినీ కొనుగోలు చేస్తామని చెప్పారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )