తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ఉత్పత్తుల ధరలను మళ్లీ పెంచారు. రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రెండు నెలల క్రితమే లీటరు ధరను రూ.2 పెంచింది. మళ్లీ ఇప్పుడు రూ.3 పెంచడంజరిగింది . తాజా పెంపుతో విజయ పాల ధర లీటరు రూ.47 అయింది. తాజాగా పెరిగిన ధరలతో ప్రస్తుతం టోన్డ్ పాలు లీటరుకు రూ.47, స్టాండర్డైజ్ పాలు రూ.51, హోల్ మిల్క్ లీటరుకు రూ.61, ఆరు లీటర్ల టోన్డ్ మిల్క్ బల్క్ప్యాక్ రూ.276, డైట్ మిల్క్ లీటరు రూ.41, ఫ్యామిలీ మిల్క్ లీటరుకు రూ.45, డబుల్ టోన్డ్ మిల్క్ రూ.43, ఆవుపాలు రూ.47, టీ స్పెషల్ మిల్క్ రూ.45 ధర పలుకుతోంది. అమ్మకాల ప్రకారం మొత్తం చూసుకుంటే విజయ పాల వినియోగదారులపై నెలకు రూ.1.87 కోట్ల అదనపు భారం మోపారు. పాడి రైతులకు ధర పెంచడానికే వినియోగదారులపైనా భారం వేయాల్సి వచ్చిందని డెయిరీ ఫెడరేషన్ వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ వినియోగదారులపై లీటరుకు రూ.3 చొప్పున భారం మోపడం చర్చనీయాంశమైంది. పెరిగిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ధరలు పెంచిన నేపథ్యంలో విజయ డెయిరీ పాల అమ్మకాలు రోజురోజుకు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు నెలల క్రితం రోజుకు 3.12 లక్షల లీటర్ల పాలు అమ్ముడు పోయేవి. మిగతా సంస్థలతో పోలిస్తే లీటరుకు రూ.4 తక్కువ ఉండడంతో వినియోగదారులు కొనేవారు. ప్రస్తుతం ధరల పెరుగుదలతో ప్రైవేటు డెయిరీలకు, విజయ డెయిరీకి ఉన్న తేడా తగ్గిపోయింది. ప్రస్తుతం 2.50 లక్షల లీటర్ల పాల విక్రయాలు మాత్రమే జరుగుతున్నట్లు సమాచారం.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )