హైద్రాబాద్ మెట్రో సంవత్సర ఆదాయం 480 కోట్లు .. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

హైద్రాబాద్ మెట్రో సంవత్సర ఆదాయం 480 కోట్లు ..

హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రగతి ని వెల్లడి .  కార్యక్రమంలో  విషయాలు వెల్లడించారు .   ప్రస్తుతం 55 రైళ్లను నడుపుతున్నామని, మరో రెండు రైళ్లను పరీక్షిస్తున్నామని 10 రోజుల్లో వాటిని కూడా అందుబాటులోకి తీసుకుని వస్తామని వివరించారు. గతంలో రోజూ 700 నుంచి 800 ట్రిప్పులు తిప్పే వారమని ప్రస్తుతం అది వెయ్యి ట్రిప్పులకు పెరిగిందన్నారు. ప్రతి రోజు నాలుగు లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారని అన్నారు. కారిడార్‌–1 నుంచి, కారిడార్‌–3 నుంచి అమీర్‌పేట్‌కు ఎక్కువగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో రాయ్‌దుర్గ్‌ రూట్‌లో సమస్య వస్తుందని అన్నారు. మెట్టుగూడ నుంచి రాయ్‌దుర్గ్‌ కొన్ని రైళ్లను, అమీర్‌పేట్‌ నుంచి రాయ్‌దుర్గ్‌కు అదనపు రైళ్లను తిప్పుతున్నామని వివరించారు. 3 మెట్రో డిపోలకు 212 ఎకరాలు, మరో 57 ఎకరాలు స్టేషన్ల కోసం మొత్తం 269 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. మియాపూర్‌ డిపో వద్ద ఇచ్చిన 100 ఎకరాల్లో డిపోకు 70 ఎకరాలు 30 ఎకరాలు వాణిజ్య సముదాయాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రతి కిలోమీటరు మెట్రో ఏర్పాటుకు ఢిల్లీలో 6 ఎకరాలు, నాగ్‌పూర్‌లో 7 ఎకరాలు, చెన్నైలో 4 ఎకరాలు ప్రభుత్వం కేటాయించిందని.. హైదరాబాద్‌ మెట్రోకు కి.మీ.కు 4 ఎకరాలు మాత్రమే కేటాయించారన్నారు. మెట్రో ఏర్పాటుకు ఎల్‌అండ్‌టీ తీసుకున్న రుణానికి వాణిజ్య బ్యాంకులకు ఏటా 11 శాతం వడ్డీ చెల్లిస్తున్నారని చెప్పారు. ప్రతి ఏడాది రూ.1,300 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. మెట్రోకు రోజుకు రూ.కోటి.. ఏటా రూ.480 కోట్ల ఆదాయం లభిస్తుం దన్నారు. ఇందులో రూ.365 కోట్లు చార్జీలు మిగతాది మెట్రో మాల్స్‌ ద్వారా లభిస్తోందన్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )